విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపటి నుంచి సెలవులు

-

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల13 నుంచి17 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. ఈ నెల 18న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఐదు రోజుల పాటు హాలిడేస్​ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ సెలవులు కేవలం నాన్ మైనార్టీ స్కూళ్లకేనని చెప్పారు. సంక్రాంతి హాలీడేస్ పెరగనున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విద్యాశాఖ అధికారులు ఖండించారు.

ఈ నెల14 నుంచి 16 వరకూ అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది. గురుకులాలకు కూడా13 నుంచే సెలవులు ఉండనున్నాయి. ఇదిలా ఉంటే.. నేటి నుంచి ఈ నెల 18 వరకు ఏడురోజులు సెలవులు ఉండడంతో బుధవారం సాయంత్రమే ఆశ్రమ, గురుకుల పాఠశాలలు ఖాళీ అయ్యాయి. ఆయా విద్యార్థులు ఇళ్ల బాట పట్టారు. ఈ నెల 18న సెలవుకు బదులుగా మరో సెలవు రోజులో పాఠశాలలు, వచ్చే నెల రెండో శనివారం రెసిడెన్షియల్‌ పాఠ శాలలు పనిచేయాల్సి ఉంది. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌,ప్రభుత్వ పాఠశాలలకు ఈ విషయమై ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version