చాలా మంది ఒత్తిడి తో బాధ పడుతూ ఉంటారు. ఆఫీసులో పనులు ఇంటి పనులు వలన ఎక్కువ ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. మీకు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా..? నిజానికి ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఎటువంటి సమస్యలు తప్పవు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జీవన విధానం మారిపోవడం వలన చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు శారీరక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి.
జీర్ణ సమస్యలు:
ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. ఒత్తిడి మూలంగా జీవక్రియలు సరిగ్గా పనిచేయవు పేగుల పోషకలను గ్రహించలేవు. ఈ కారణంగా బలబద్ధకం, విరోచనాలు వంటి ఇబ్బందులు ఉంటాయి.
ఇమ్యూనిటీ తగ్గిపోవడం:
ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది ఈ కారణంగా వివిధ రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.
తలనొప్పి:
ఒత్తిడి ఎక్కువగా ఉంటే తలనొప్పి కూడా వస్తుంది అలానే ఆందోళన వంటి సమస్యల్ని కూడా ఎదుర్కోవాలి.
హృదయ సంబంధిత సమస్యలు:
ఒత్తిడి ఎక్కువ ఉండడం వలన హృదయ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడి ని తగ్గించుకోవడానికి చూడండి.
ఆల్జీమర్స్:
ఇది కూడా ఒత్తిడి కారణంగా కలుగుతుంది.
చర్మ సమస్యలు:
ఒత్తిడి వలన చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి దద్దుర్లు, మొటిమలు, నల్ల మచ్చలు ఇలా వివిధ రకాల చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఊబకాయం:
ఒత్తిడి మూలంగా ఊబకాయం కూడా వచ్చే ఛాన్స్ ఉంది కనుక అధిక ఒత్తిడి తో మీరు బాధపడుతున్నట్లయితే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.