కరోనా వైరస్ నివారణ కోసం చాలా మంది సెలబ్రిటీలు తమ వంతు సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతమున్న సోషల్ మీడియా ప్రభావంతో రియల్ న్యూస్ కంటే కూడా ఫేక్ న్యూసే ఎక్కువ ప్రచారం సాగుతోంది. ఈ సోషల్ మీడియా ను ఉపయోగించుకుని చాలా మంది అభిమానులు తమ భిమాన హీరోల గురించి, క్రికెటర్ల గురించి గొప్పలు చెప్పుకునేందుకు ఫేక్ న్యూస్ ను ఇష్టానుసారంగా ఫార్వార్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బాధితుల విషయంలో కూడా అదే జరుగుతోంది.
రీసెంట్ గా బాలివుడ్ హీరో అమీర్ ఖాన్ కరోనా నివారణకు రూ.250 కోట్లు విరాళం ఇచ్చాడంటూ ఓ ఫేక్ వార్త వాట్సాప్, ఫేస్ బుక్ లోచక్కర్లు కొట్టింది. చాలా మంది ఈ న్యూస్ ని షేర్లు చేశారు. ఇప్పుడు అలాంటిదే మరో వార్త షేర్ అవుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రూ.లక్ష విరాళం ప్రకటించాడంటూ కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను ధోని భార్య సాక్షి సింగ్ ఖండించారు. ఆ వార్తలన్నీ అబద్దమని ఆమె కొట్టిపారేశారు. ఇంత విపత్కర కాలంటలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం తగానా అని ఆమె ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యమని సాక్షి ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు..