Salaar : ప్రభాస్‌ సలార్‌ వీడియో సాంగ్‌ లాంఛ్ టైం ఫిక్స్

-

ప్రభాస్ మరియు శృతిహాసన్ హీరో, హీరోయిన్లుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్. ఈ చిత్రం 22 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేర్ చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

ఇదిలా ఉండగా….ఈ మూవీ నుంచి ‘వినరా ‘వీడియో సాంగ్‌ను రేపు ఉదయం 10 గంటలకు కన్నడ ,తమిళం ,మలయాళం, హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు.ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించినది. హొంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగదర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతాన్ని సమకూర్చగ భువన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ . ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ,జగపతిబాబు ,ఈశ్వరి కుమారి మొదలైన వారు కీలకపాత్ర పోషిస్తున్నారు.పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సలార్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news