రన్ మెషీన్ కింగ్ కోహ్లీ మరోసారి రికార్డుల వేటలో పడ్డాడు. ఇటీవలే ఇండియాలో ముగిసిన వన్డే ప్రపంచ కప్‌లో సచిన్ పేరిట వన్డేల్లో ఉన్న 49 సెంచరీల రికార్డును అధిగమించిన సంగతి తెలిసిందే.సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న కోహ్లీ గతంలో రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన రికార్డులకు అడుగుదూరంలో ఉన్నాడు.
కోహ్లీ ఇప్పటివరకూ సౌతాఫ్రికాపై 14 టెస్టులు ఆడగా ఇందులో 56.18 యావరేజ్ తో 1236 పరుగులు చేశాడు. ప్రస్తుతం జట్టులో సౌత్ ఆఫ్రికా పై టెస్టులలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ అతడే కానీ.. ఇండియా నుంచి నాలుగో వాడు.25 టెస్టులలో 42.46 సగటుతో 1741 రన్స్ చేసిన సచిన్ సఫారీ పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేయాలంటే కోహ్లీకి 505 రన్స్ కావాలి.
దక్షిణాఫ్రికా టీం పై ద్రావిడ్ 1252 రన్స్ చేయగా,సెహ్వాగ్ 15 టెస్టులలో 1306 రన్స్ చేశాడు. ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేయడానికి కోహ్లీకి 16 రన్స్, వీరూ రికార్డు కోసం 70 రన్స్ చేయాల్సి ఉంది.