Salar :మొదటి రోజే 30 లక్షలకి పైగా అమ్ముడయిన టికెట్స్ …….

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. బాహుబలి సిరీస్ విడుదలైన తర్వాత ప్రభాస్ చేసిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే కేజిఎఫ్ తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే చాలాసార్లు విడుదల తేదీ వాయిదా పడడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గింది అనుకున్నారు కానీ రీసెంట్గా విడుదలైన ట్రైలర్స్ మరియు సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే అడ్వాన్స్ టికెట్స్ కోసం ఓపెన్ చేసిన బుక్ మై షో ఆప్ క్రాష్ అయ్యింది. మరి ఆ రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

 

ఈ సినిమాకి నిన్నటి వరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి అనేది నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు 30 లక్షలు పైగా టికెట్లు అమ్ముడుపోగా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 13.25 లక్షలు కాగా నైజాం నుంచి ఆరు లక్షలు, నార్త్ ఇండియా 5.25 లక్షలు, కర్ణాటకలో 3.25 లక్షలు, కేరళలో లక్షన్నర మరియు తమిళనాడులో లక్ష టికెట్లు అమ్ముడయాయని ప్రకటించింది. అలాగే అడిషనల్ స్క్రీన్ కి త్వరలోనే బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version