బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి, ఆయన సినిమాల రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సినిమా విడుదల అవుతుందంటే.. బాక్సాఫీస్‌కు దడ పుట్టాల్సిందే. ఇప్పటికి వంద కోట్లు కొల్లగొట్టడానికి కిందామీదా పడే బాలీవుడ్ హీరోలున్నారు. కానీ సల్మాన్ ఫ్లాప్ సినిమానే మినిమం వంద కోట్లు రాబడుతుంది. దటీజ్ సల్మాన్. అదంతా కాసేపు పక్కనబెడితే.. ఆయన ఇప్పుడు ముద్దుల మామయ్యగా మారిపోయాడు.
సల్మాన్ సోదరి అర్పితా ఖాన్‌కు ఇద్దరు పిల్లున్నారన్న సంగతి తెలిసిందే. అందులో అయాత్ శర్మ రెండు మూడు నెలల క్రితమే జన్మించింది. ఇక మేనకోడలుతో జన్మించడంతో మామయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కోడలితో మామయ్య ఓ ముచ్చటైన ఆట ఆడుకుంటూ ఉన్నాడు. అలా సల్లూ భాయ్ తన కోడలితో ఆడుకుంటున్న వీడియోను అర్పితా ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కోడలు అయాత్ను మామయ్య ముద్దులతో తడిపేశాడు. సల్మాన్ పెట్టే ముద్దులకు ఆ చిన్నారి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండటం.. మామకు తిరిగి ముద్దులు పెట్టడం ఇదంతా వీడియోలో ఉంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సల్మాన్ ప్రస్తుతం రాధే సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ మూవీని ప్రభుదేవా తెరకెక్కిస్తున్నాడు.