Salman Khanఆ హోస్ట్ కు రూ.350 కోట్ల రెమ్యునరేషన్‌..! ఇంత‌కీ ఆ షో ఏంటీ?

-

Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌త‌ మూడు దశాబ్దాలుగా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. ఆయ‌న సినీ కెరీర్‌లో ఎ‍న్నో సూపర్‌హిట్స్‌ అందుకొని స్టార్‌గా నిలిచారు. అయితే.. ఇప్ప‌డూ స‌ల్మాన్ రెమ్యున‌రేషన్ విష‌యంలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఆయ‌న నిమిషాల వ్య‌వ‌ధిలో ఉంటే యాడ్స్ కే అర‌కోటి వ‌ర‌కు వ‌సూల్ చేశారని టాక్ . అలాగే.. బిగ్ బాస్ షో విష‌యంలో కూడా భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం.

బిగ్ బాస్ షో గురించి కొత్త‌గా చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రం లేదు. బిగ్ బాస్‌.. వ‌ర్డ‌ల్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఒక‌టి. బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ పొందిన షో. ఈ షో లో వివిధ భాషలలో స‌క్సెస్ పుల్ గా ర‌న్ అవుతుంది. హిందీ, తమిళం, క‌న్న‌డ‌, తెలుగు భాషలలో ఓ రేంజ్ దూసుక‌పోతుంది. తెలుగులో ఈ షో నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకుని.. ఐదో సీజ‌న్లోకి అడుగుపెట్టింది. కాగా.. హిందీలో మాత్రం .. ఏకంగా 14 సీజన్లను స‌క్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని 15 వ సీజన్ ను ప్రారంభించ‌బోతుంది. అయితే.. ఈ షోకు నాల్గో సీజ‌న్ నుంచి 14 వ సీజ‌న్ వ‌ర‌కూ కండాల వీరుడు స‌ల్మాన్ ఖాన్ నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రి స్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగ‌నున్న 15వ సీజ‌న్ కూడా ఆయ‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నట్టు స‌మాచారం. అయితే.. ఈ షోకు సల్మాన్ ఖాన్ క‌ళ్లు తిరిగే.. దిమ్మ తిరిగే తీరులో పారితోషికం పుచ్చుకోనున్నారు.

ఆయ‌న‌కు బిగ్ బాస్ నిర్వాహకులు తొలిసారి నాలుగవ సీజన్ కి కేవలం పాతిక కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న సల్మాన్ ఖాన్ 15వ సీజన్ కి ఏకంగా 350 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఒక్కోవారానికి 50 కోట్లు అన్న‌మాట. ఈ రెమ్యూనరేషన్ బ‌ట్టి ఆయ‌న పాపులారిటీ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక రియాల్టీ షో హోస్ట్ కి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించ‌డం బిగ్‌బాస్‌కే ద‌క్కింది. మొత్తం మీద‌ సల్మాన్ ఖాన్.. తన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నాడనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version