న్యూడ్ వీడియో కాల్ పై స్పందించిన మాజీ సీఎం..అది మార్ఫింగ్..!

-

క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి బీజేపీ నేత స‌దానంద గౌడ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. సదానంద గౌడ ఓ మ‌హిళ‌తో అశ్లీల వీడియో కాల్ మాట్లాడిన‌ట్టు వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో స‌దానంద గౌడ ముఖం క్లారిటీగా క‌నిపిస్తోంది. అయితే తాజాగా ఈ వీడియోపై స‌దానంద గౌడ స్పందించారు. ఆ వీడియోలో ఉంది తాను కాద‌ని అన్నారు. ఎవ‌రో కావాల‌నే దుశ్ప్ర‌చారం చేస్తున్నార‌ని సదానంద గౌడ చెబుతున్నారు. వీడియోలో త‌న ముఖాన్ని మార్ఫింగ్ చేశార‌ని స‌దానంద గౌడ ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా స‌దానంద గౌడ కుమారుడిపై 2014లో కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లే వ‌చ్చాయి. ఓ క‌న్న‌డ న‌టిపై స‌దానంద కుమారుడు అత్యాచారం చేశాడ‌ని కేసు న‌మోదైంది. ఇక ప్ర‌స్తుతం సదానంద వీడియో వైర‌ల్ అవుతుండ‌టంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వక్తం చేస్తున్నారు. స‌దానంద గౌడ్ వీడియోల‌ను వైర‌ల్ చేస్తూ మండి ప‌డుతున్నారు. మార్ఫింగ్ వీడియో కాద‌ని వీడియో లో స్ప‌ష్టంగా స‌దానంద గౌడ క‌నిపిస్తున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version