టాలీవుడ్ లో నాగ చైతన్య- సమంత విడాకుల వ్యవహారం సంచలనం కలిగించింది. విడాకులకు రకరకాల కారణాలు వెతుకుతూ నెటిజన్లు తెగ హడావుడి చేస్తున్నారు. కొందరు సమంతది తప్పు అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొంత మంది నాగ చైతన్యదే తప్పూ అంటూ తమకు ఇష్టం వచ్చిన రీతిలో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. తాజాగా యాక్టర్ మాధవీలత కూడా చైసామ్ విడాకుల వ్యవహారంపై స్పందించింది.
పెళ్లైన తర్వాత గ్రామర్ బట్టలు వేసుకుంటుందనే వదిలేశాడనేది తప్పు అని అంది. సమంతకు తల్లికావాలనే ఆశ ఉండేదని గతంలో ఒక షోలో చెప్పిందని తెలిపింది. అయితే ప్రెగ్నెన్సీ వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోతాయని తనను ఆపిందెవరు అని అక్కినేని ఫ్యామిలీపై పరోక్ష వ్యాఖ్యలు చేసింది. సమంతను కేవలం డబ్బు మిషన్ లాగే వాడారని విమర్శించింది. పెళ్లి అయిన తర్వాత పాకెట్ మనీ ఇస్తారని ఎంతమందికి తెలుసని ప్రశ్నించింది. కోట్లు సంపాదించినా వేలల్లో ఇచ్చేవారని అంది. ఈ విధంగా జీవించే కన్నావిడిపోవడమే ఉత్తమమని కామెంట్ చేసింది. ఇప్పటికైనా అక్కినేని కుటుంబం నుంచి బయటకు వచ్చి, విడాకులు తీసుకోవడమే బెస్ట్ అంటూ కామెంట్ చేసింది.