అక్కినేని కోడ‌లి ప్లాంట్ లేడీ అవ‌తారం!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత సినిమా షూటింగుల్లో పాల్గొన‌క‌పోయినా బిజీగా మారిపోయింది. లాక్‌డౌన్ నుంచి ఇంటి ప‌ట్టునే వుంటోంది. భ‌ర్త నాగ‌చైత‌న్య‌, డాగ్ హాష్‌తో క‌లిసి ఇంటి ప‌ట్టునే వుంటూ వ‌చ్చిన సామ్ మేడ‌పై వెజిటెబుల్స్ పండిస్తూ అర్బ‌న్ వ్య‌వ‌సాయానికి తెర‌లేపింది. ఇంటి టెర్రాస్ పై అన్ని ర‌కాల కూర‌గాయ‌ల్ని పండిస్తూ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

తోట‌ప‌ని ప‌ట్ల త‌న‌కున్న ప్రేమ‌ని ఈ విధంగా బ‌య‌ట‌పెట్టింది. పట్టణ వ్యవసాయాన్ని చేపట్టడానికి ప్రతి ఒక్కరినీ ప్రేరేపించడంతో పాటు ఇంట్లో పెరిగే ఉత్పత్తుల నుంచి రుచికరమైన వంటకాలను నేరు్చుకుంటూ కొత్త కొత్త వంట‌లు నేర్చుకుంది. తాజాగా త‌న‌ని తాను `ప్లాంట్ లేడీ`గా ప్ర‌క‌టించుకున్న స‌మంత త‌న ఇంటి బాల్క‌నీలో వున్న మొక్క‌ల ప‌క్క‌న కూర్చున్న ఫొటోని నెటిజ‌న్‌ల‌తో పంచుకుంది.  చాలా కూల్‌గా స్లీవ్ లెస్ మ్యాక్సీలో క‌నిపిస్తున్న స‌మంత ఫొటోని చూసిన వాళ్లంతా అక్కినేని కోడ‌లి ప్లాంట్ లేడీ అవ‌తారం అని కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version