త్వ‌ర‌లో బాలీవుడ్ ఎంట్రీ….క్లారిటీ ఇచ్చిన సామ్..!

చైతూతో విడాకుల అనంత‌రం సమంత మ‌ళ్లీ కెరిర్ పై దృష్టి పెడుతోంది. వ‌రుస సినిమాలు చేస్తూ స‌మంత ఫుల్ బిజీగా మారిపోతుంది. ఇక స‌మంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో బోల్డ్ గా న‌టించ‌డ‌మే సమంత సంసారంపై ఎఫెక్ట్ చూపించ‌న్న వాద‌న‌లు కూడా వినిపించాయి. ఏది ఏమైనా ఈ సిరీస్ తో మాత్రం స‌మంత బాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకుంది. అప్ప‌టి నుండి సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా తాజాగా ఆ వార్త‌ల‌పై స‌మంత క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంట‌ర్యూలో స‌మంత మాట్లాడుతూ…మంచి క‌థ వ‌స్తే బాలీవుడ్ లో త‌ప్ప‌కుండా సినిమా చేస్తాన‌ని స‌మంత క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ సినిమాల్లో న‌టించాల‌నే ఆస‌క్తి త‌న‌కు ఉంద‌ని సినిమాకు ఓకే చెప్పే ముందు త‌న‌కు క‌థ సూట్ అవుతుందా…క‌థ‌లో జీవం ఉందా లాంటి ప్ర‌శ్న‌ల‌ను వేసుకుంటాన‌ని స‌మంత చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాప్సీ ప్రారంభించిన నిర్మాణ సంస్థ ద్వారా సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.