స్క్రిప్టు అద్భుతంగా ఉంటుంది.. సినిమా తేలిపోతుంది.. డైరెక్ట‌ర్స్‌పై స‌మంత హాట్ కామెంట్స్‌..!

-

ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన త‌క్కువ స‌మ‌యంలోనే వ‌రుస విజ‌యాల‌తో నెంబర్ వన్ పీఠం అందుకున్న హీరోయిన్ సమంత. స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈమె.. ఆ తర్వాత చిన్న హీరోలతో కూడా రొమాన్స్ చేసింది. ఇక సమంత కాస్త మూడేళ్ల కింద సమంత అక్కినేని కూడా అయిపోయింది. అయితే నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నప్ప‌టికీ వరస సినిమాలు చేస్తూ సత్తా చూపిస్తుంది సమంత. అయితే పెళ్లికి ముందు గ్లామరస్ రోల్స్ చేసిన ఈమె.. తర్వాత మాత్రం లేడీ ఓరియేంటేడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన జాను చిత్రంతో నటనపరంగా సమంత మంచి మార్కులే కొట్టేశారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే సమంత జానుతో మరో మెట్టు ఎక్కారని విమర్శకులు సైతం ప్రశంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సమంత ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తన భర్త నాగచైతన్యకు సినిమాల ఎంపికలో తాను ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. చైతూ సినిమాల విషయంలో ఎంతమాత్రం తాను జోక్యం చేసుకోనని వెల్లడించారు. సినిమాలు స్క్రిప్టు దశలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అనిపిస్తాయని, కానీ అందరు దర్శకులు స్క్రిప్టును ఉన్నది ఉన్నట్టుగా తీయలేరని అభిప్రాయపడ్డారు. “కొందరు స్క్రిప్టు వివరించే విధానం అద్భుతంగా ఉంటుంది కానీ తెరకెక్కించే విధానం తేలిపోతుంది. ఈ విషయంలో నా వరకు నేను చాలా లక్కీ. నేను స్క్రిప్టులో ఏం ఊహించుకున్నానో నా డైరెక్టర్లు అదే తెరకెక్కించారు. రంగస్థలం చిత్రం విషయానికొస్తే నాకు పూర్తి స్క్రిప్టు అస్సలు తెలియదు. నా పాత్రలో ఏదో మ్యాజిక్ ఉందనుకున్నానంతే. అదే నిజమైంది” అంటూ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version