సమంత, నాగ చైతన్య మద్య గొడవ తెచ్చిన జాను .. అసలేమైందంటే ..?

-

అక్కినేని సమంత-శర్వానంద్ జంటగా నటించిన సినిమా ‘జాను’. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాను తెలుగులో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర పై నిర్మించారు. సమంత గత సంవత్సరం నటించిన మజిలీ, ఓ బేబి సూపర్ హిట్స్ అందుకోవడంతో ఇండస్ట్రీలో అందరిలోనూ అలాగే అక్కినేని ఫ్యాన్స్ తో పాటూ కామన్ ఆడియన్స్ లోను ఈ సినిమా మీద భారీగా అంచానాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను ‘జాను’ ఏమాత్రం అందుకోలేకపోయింది. దారుణంగా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.

 

అయితే మజిలీ సక్సస్ తో ఈ సినిమాలో నాగ చైతన్య-సమంత లని నటింపచేయాలని దిల్ రాజు ముందు అనుకున్నాడన్న విషయం తెలిసిందే. మజిలీ మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేసి క్యాష్ చేసుకోవాలనుకున్నాడు రాజు గారు. కానీ నాగ చైతన్య ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి చూపించకుండా దిల్ రాజు ఆఫర్ ని రిజక్ట్ చేస్తూ సమంతని కమిటవద్దని చెప్పాడట. కాని సమంత మాత్రం 96 మీద మనసు పారేసుకొని ఇక్కడ లాక్ అయిపోయింది. అంతేకాదు ఒకవేళ హిట్ అయితే తనకి హ్యాట్రిక్ హిట్ గా తన ఖాతాలో పడుతుందని ఆశ పడింది. అదే ఇప్పుడు పెద్ద పొరపాటైంది.

ఈ సినిమా దారుణంగా ఫ్లాపవడంతో సమంత గత రెండు చిత్రాల ద్వారా వచ్చిన క్రేజ్ కాస్తా పోయింది. ఇప్పుడు సమంత చేతిలో ప్రస్తుతానికి ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తోంది. మెగాస్టార్ సినిమాలో చరణ్ సరసన అరగంట పాత్ర ఒప్పుకుందని వార్తలు వస్తున్నప్పటికి అందులో వాస్తవం ఎంతన్నదాని మీద చిత్ర బృందం ప్రకటించలేదు. అయితే జాను ఫ్లాప్ అవడంతో సమంత చైతూ మధ్య చిన్న సమస్యలు తలెత్తాయని సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version