మన దేశాన్ని కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. దేశంలో ఓ రోజు కరోనా కేసులు పెరగడం.. మరో రోజు తగ్గడం చోటు చేసుకుంటోంది. ఇక ఇవాళ మరోసారి పెరిగాయి కరోనా కేసులు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,431 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,94,312 కు చేరింది. గడిచిన 24 గంటల్లో మాత్రం 43,09,525 మందికి వ్యాక్సిన్ వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,32,00,258 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,44,198 కు చేరింది.ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.09 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 318 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,49,856 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 24,602 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 92,63,68,608 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.