అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత మరింత అందాలను ఆరబోస్తుందనే చెప్పాలి. తెలుగు సినిమాలకు ఫ్యాషన్ ఐకాన్‌గా మరిన సమంత ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తూ తన గ్లామర్‌తో మతి పోగొడుతోంది. తనకు సంబంధించిన విషయాలు, కొత్త కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో తరచూ పంచుకునే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఓ ఫ్యామిలీ ఫొటోలో ఆమె ధరించిన దుస్తుల ధర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అక్కినేని నాగార్జున 60వ పుట్టిన రోజు సందర్భంగా డెస్టినేషన్ వేడుకల కోసం అభిమానులకు టచ్‌లో లేకుండా ఫ్యామిలీతో సహా స్పెయిన్ కు వళ్లిపోయారు. అక్కడ నాగ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే మామ బర్త్‌డే వేడుకల్లో సమంత హాట్ లుక్‌తో వన్ షోల్డర్ షిమ్మర్ పింక్ కలర్ డ్రస్‌లో అందరిని ఆకర్షించింది. అయితే ఆమె డ్రస్ ఖరీదుపై ఆసక్తికరంగా చర్చలు నడుస్తున్నాయి. సమంత వేసుకున్న డ్రస్ దాదాపు 2 లక్షలు ఉంటుందని అంటున్నారు.
వాస్తవానికి బాలీవుడ్ భామల డ్రస్‌ల గురించే చర్చించే వారికి ఇప్పడు సౌత్ హీరోయిన్ సమంత డ్రస్ ధర హాట్ టాపిక్‌గా మరింది. అయితే కొందరు ఇలాంటి చిన్న అకేషన్‌కి అంత ఖరీదైన డ్రస్ అవసరమా అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక నాగార్జున మాత్రం కొడుకుల మధ్య సింపుల్ డ్రస్‌తో యంగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇవే ఫొటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.