దాచడం, ఫేక్ గా ఉండడం నాకు నచ్చవు – సమంత

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. ఓవైపు సిటాడెల్ సిరీస్ షూటింగ్.. మరోవైపు శాకుంతలం సినిమా ప్రమోషన్స్​తో చాలా బిజీగా ఉంటోంది. అందుకే తరచూ ముంబయి, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతోంది.

 

ఇక ఈ భామ ప్రస్తుతం తన ఫోకస్ అంతా శాకుంతలం సినిమా ప్రమోషన్స్​పైనే పెట్టింది. తాజాగా ముంబయిలో ఈ సినిమా హిందీ వెర్షన్​కు ప్రమోషన్స్​లో పాల్గొంది. ఈ మూవీలో తనకు జంటగా నటించిన దేవ్ మోహన్​తో కలిసి సమంత ప్రమోషన్స్​కు హాజరైంది.

అయితే తాజాగా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు దాచడం అలాగే ఫేక్ గా ఉండడం నచ్చవంటూ పేర్కొంది సమంత. నా జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నా లైఫ్ తెరిచిన పుస్తకం.. నా జీవితంలో ఎత్తు పొలాలను పారదర్శకంగా అందరూ చూడవచ్చు అని పేర్కొంది సమంత. జీవితంలో సంతోషంగా ఉండడం అలాగే ప్రేమను పంచడం మాత్రమే తనకు తెలుసు అని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version