Samantha : బ్లాక్‌ డ్రెస్‌లో.. సమంత వయ్యారాలు..

-

సమంత లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న సామ్ కళ్లద్దాలు ధరించి కనిపించింది. కాస్త అలసినట్లు ఫొటోలో కనిపించింది. ప్రచారంలో ఉన్నట్లుగా ఆమె ముఖంపై ఎలాంటి దుద్దుర్లు లేవు.

ఎప్పటిలాగే ఫెయిర్‌గా కనిపించింది. ఈనెల 11న ఆమె నటించిన యశోద మూవీ రిలీజ్ కానుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా యాంకర్ సుమ ఆమెను ఇంటర్వ్యూ చేసినట్లు తెలిసింది.

ఒకటి రెండు రోజుల్లో ఈ వీడియో బయటకు రానుంది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత తెలిపింది. కనీసం తన ఫేస్ కూడా చూపించకుండా సెలైన్‌ ఎక్కించుకున్న ఫొటో షేర్ చేసిన విషయం తెలిసిందే.

సమంత తాజాగా నటిస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “యశోద”. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలోని సమంత యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికే హైలైట్ గా నిలవనున్నాయి అని చెబుతున్నారు మేకర్స్.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేసాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version