Samantha: సామ్‌- చైతూ విడాకులు..! అక్టోబర్ 6న ఏమి జరగనుంది? ఇండ‌స్ట్రీలో స‌ర్వ‌త్ర ఉత్కంఠ!

-

Samantha: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీ ఫేర్ స‌మంత(samantha)- నాగ చైతన్య(Naga chaithanya). కానీ గ‌త కొద్ది రోజులుగా వీరి వివాహ బంధంపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. వారిద్ద‌రూ విడివిడిగా ఉండ‌టంతో.. విడాకులు తీసుకోబోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

గ‌త కొద్దిరోజులుగా వారిద్ద‌రూ దూరంగా ఉండ‌టం, స‌మంత గచ్చిబౌలీ లోని నివాసాన్ని ఖాళీ ముంబైకి మ‌కాం మార్చ‌డాని సమాచారం. అలాగే, కింగ్‌ నాగార్జున బర్త్ డే వేడుకలకు హాజ‌రుకాకుండా.. తన మిత్రులతో గోవా టూర్ కి వెళ్ల‌డం ఇవ్వ‌ని విడాకులు తీసుకుంటున్నార‌నే వాదనకు మ‌రింత
ఊతమిచ్చాయి. ఈ పుకార్ల‌పై స‌మంత కాని, అటు నాగ చైత‌న్య కాని స్పందించ‌క‌పోవ‌డంతో రోజు రోజుకి కొత్త వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా సమంత విడాకుల కారణాలు, నాగ చైతన్య ఇచ్చే భరణం అంశాల గురించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి.

ఇక మీడియా కథనాల ప్రకారం సమంత, చైతన్య కుటుంబ సభ్యులు ఇద్దరికీ సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారట. కానీ ఎలాంటి ఫ‌లితం లేద‌ని స‌మాచారం. దీంతో సమంత, చైతూ విడాకులకు అప్లై చేశారట. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని,
ఈ త‌రుణంలో స్థిర, చర ఆస్తులతో కలిపి సమంతకు భరణంగా 250 నుండి 300 కోట్ల వ‌ర‌కు అక్కినేని ఫ్యామిలీ ఇవ్వ‌నుంద‌ని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజ‌ముంద‌నేది తెలియాలంటే.. స‌మంత‌గానీ, చైత‌న్య గానీ స్పందించ త‌ప్పదు.

అయితే.. అక్టోబర్ 6న సమంత, చైతూ వివాహ బంధంపై ఓ క్లారిటీ రానున్న‌ది. ఈ జంట ఆ రోజు 4వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోనున్నారు. పెళ్లి రోజు సోషల్ మీడియా వేదికగా వారి స్పందన, కామెంట్స్, పోస్ట్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. కాబట్టి అక్టోబర్ 6 సామ్‌- చైతూల జీవితంలో కీలకమైన రోజు కానుంది. మ‌రోవైపు.. లవ్ స్టోరీ ట్రైలర్ పై.. చాలా బాగుంది అని స‌మంత కామెంట్ చేయగా, చైతూ థాంక్స్ చెప్పారు. ఇదే చివరిగా వీరి మధ్య జరిగిన కీలక సంఘటన.

Read more RELATED
Recommended to you

Exit mobile version