ప్రీతమ్ జుకల్కర్ తో రిలేషన్ పై సమంత సంచలన పోస్ట్ !

అక్కినేని నాగచైతన్య మరియు టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అటు అక్కినేని మరియు ఇటు సమంత ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. అంతేకాదు.. ఈ విడాకుల విషయంలో సమంత పై చాలా సీరియస్ అవుతున్నారు ఫాన్స్… సమంత వేరే వ్యక్తిని( పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్) పెళ్లి చేసుకుని నేపథ్యంలోనే… విడాకులకు సిద్ధమైన అంటూ ఘోరంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

తన గ్లామర్ పోతుందని… నాగచైతన్య తో పిల్లలను కూడా కనలేదని పోస్టులు కూడా పెడుతున్నారు. ముఖ్యంగా సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో సమంతకు ఎఫైర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై తాజాగా స్వయంగా సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

” విడాకులు అనేది చాలా పెద్ద విషయం. తన మనసును చాలా బాధించింది. ఇలాంటి సమయంలో కొంతమంది అండగా ఉండకుండా… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని మరియు పిల్లలను కావాలనే కనలేదని అంటున్నారు. ఇలాంటి వార్తలు తనను చాలా బాధించాయి. ఆ వార్తలన్నీ తప్పు. తనను ఒంటరిగా వదిలేయండి. ” అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.