మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను గెలిపిస్తే.. అభివృద్ధి పనుల గురించి సిఎం కెసిఆర్ తో మాట్లాడే మొఖం ఉండదని తెరాసా అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో పర్యటించారు తెరాసా అభ్యర్థి గెల్లు శ్రీనివాస్. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగాలను భర్తీ చేయ లేని ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమని.. రైల్వే వంటి సంస్థలలో కూడా ఇంత వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వ లేదని ఫైర్ అయ్యారు.
పన్నుల మీద పన్నులు వేస్తున్న బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు గెల్లు శ్రీనివాస్. బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధర పెట్రోల్ ధరలు పెంచుతుందని.. తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని కొనియాడారు. తనను గెల్పిస్తే స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తానని హామీ ఇచ్చారు గెల్లు శ్రీనివాస్. అదే బిజెపికి ఓటు వస్తే ఆఅ అవక్షం ఉండదన్నారు. ఉద్యమంలో తన మీద 130 కేసులు ఉన్నాయని.. మీరందరూ ఆశిర్వదించి తనను గెలిపించారని కోరారు తెరాసా అభ్యర్థి గెల్లు శ్రీనివాస్.