గాడ్ ఫాదర్ సినిమా సీక్వెల్ ఉంటుందా.. ఇందులో నిజమెంత..!!

-

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం విడుదలవ్వడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాకి సీక్వెల్ ఉండవచ్చు అన్నట్టుగా చిరంజీవి కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఈ విధంగా కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని డైరెక్టర్ మోహన్ రాజాను అడగగా.. అందుకు సమాధానంగా తెలియదని చెప్పారని చిరంజీవి తెలియజేశారు.

డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇదే విషయాన్ని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా సీక్వెల్ సిద్ధంగా ఉందని..కథ నచ్చితే మీతో చేస్తానని చిరంజీవికి డైరెక్టర్ చెప్పినట్లుగా తెలియజేశారు. గాడ్ ఫాదర్ సినిమా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తే.. గాడ్ ఫాదర్ -2 దిశగా అడుగులు పడతాయని చిరంజీవి తెలియజేశారు. ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ కూడా ఉన్నట్లయితే ఈ చిత్రంలో కూడా చిరంజీవి,సల్మాన్ ఖాన్ కలిసి నటించాల్సి ఉంటుంది. గాడ్ ఫాదర్ సినిమా పైన ప్రస్తుతం భారీగా అంచనాలు పెరుగుతూ ఉండడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందా అని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి మాత్రం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్లోనే తేరకెక్కించినట్లు తెలుస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు చిత్ర బృందం. మరి ఈ సినిమా ఒకవేళ సక్సెస్ అయ్యింది అంటే డైరెక్టర్ మోహన్ రాజాకు తెలుగు లో పలు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ రైట్స్ కూడా ఈ సినిమా భారీ ధరకే అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version