విడాకుల అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేసిన స‌మంత‌.. !

టాలీవుడ్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగ చైతన్య గత నాలుగు నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పరస్పర ఒప్పందం మేరకు తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో.. అక్కినేని ఫ్యాన్స్ అలాగే సమంత ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఇక ప్రస్తుతం సమంత, నాగచైతన్య ఎవరి కెరీర్ లు వారు చూసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సమంత తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకులు ప్రకటనలకు సంబంధించిన అనౌన్స్మెంట్ నోట్ ను డిలీట్ చేసింది.

దీంతో అందరూ అసలు సమంత అలా ఎందుకు చేసింది అంటూ ఆలోచనలో పడ్డారు. వీరిద్దరూ మళ్లీ ఏమైనా కలుసుకునే ఆలోచనలో ఉన్నారా ? అందుకే సమంత అలా చేసిందా ? ఇలాంటి ఆలోచనలు కూడా రాకమానవు. అయితే నాగచైతన్య ఇంస్టాగ్రామ్ లో మాత్రం డైవర్స్ స్టేట్మెంట్ అలాగే ఉంది. ఒకవేళ ఇద్దరు కలిసి పోవాలి అనుకుంటే నాగచైతన్య కూడా ఆవిడే కుల స్టేట్మెంట్ ను డిలీట్ చేయాలి. కానీ అలా జరగలేదు. అయితే సమంత మాత్రం డిలీట్ చేయడం పై టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిపై చర్చ జరుగుతోంది.