ప్రధాని మోడీ సంచలన నిర్ణయం… 50 ఏళ్ల చరిత్ర కు స్వస్తి

-

ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 50 సంవత్సరాల తర్వాత అమర జవాన్ జ్యోతినీ ఆర్పి వేయాలని తాజాగా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని ఇవాళ… ఆర్పివేయనున్నారు. అమర జవాన్ జ్యోతి ని శాశ్వతంగా అవును మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ జ్యోతిని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద జ్యోతి లో కలిపేయనుంది.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమర్ జవాన్ జ్యోతి ని… యుద్ధ స్మారక జ్యోతిలో కలపనున్నారు. రెండు జ్యోతులను నిర్వహించడం కష్టంగా ఉన్న కారణంగానే… ఈ రెండిటినీ కలిపేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1971 సంవత్సరంలో ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం అమర్ జవాన్ జ్యోతి ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972 సంవత్సరంలో అమర్ జవాన్ జ్యోతి ని ప్రారంభించారు. 2019లో జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news