రాజకుమారి పాత్రలో సమంత..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. దక్షిణాదిలో విజయవంతమైన కెరీర్ నిర్మించుకున్న సమంత ఏళ్లపాటు అగ్రతారగా వెలిగింది. ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వచ్చింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా పేరుపొందింది.

ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఈమె ఒక్కసారిగా ఈమె పేరు మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటీవలే పుష్ప చిత్రంలో కూడా ఐటమ్ సాంగ్ లో నటించి సోషల్ మీడియాని షేక్ చేసింది. డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ల ద్వారా హిందీ ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది.

 

” ది ఫ్యామిలీ మెన్ 2″ తో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సమంత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొని హిందీలోనూ పలు చిత్రాలు ఓకే చేసే పనిలో ఉంది. తాజాగా ఆమె కొత్త సినిమాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ లో వినిపిస్తోంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో సమంత ఓ యువరాణి పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుందట. ఇందులో ఆయుష్మాన్ ఖురానా ఓ డ్రాక్యూలా తరహా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓ రాజస్థానీ జానపద గాధ ఆధారంగా తెరకెక్కించనున్నారని జాతీయ మీడియా పేర్కొంది

Read more RELATED
Recommended to you

Exit mobile version