అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రమాణం తర్వాత ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాబోయే నాలుగేళ్లలో తన పాలన ఎలా ఉండబోతుందో తొలి ప్రసంగంలో ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే అమెరికాలో జన్మతహా లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు.రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ ను సవరించి వందేళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చట్టబద్దంగా అమెరికాలో ఉంటున్న వారి సంతానానికి మాత్రమే బర్త్ సిటిజన్ షిప్ వర్తించనుంది. అక్రమ వలసదారుల పిల్లలకు వర్తించదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది డెలివరీ కోసం అమెరికాకు వెళ్లి అక్కడ పిల్లలకు జన్మనిచ్చి పిల్లలకు సిటిజన్ షిప్ పొందారు. అందులో భారతీయులు సైతం ఉన్నారు.