తాగిన మత్తులో పొరుగింటి వారితో గొడవకు దిగిన జైలర్ మూవీ విలన్..

-

జైలర్ మూవీలో వర్త్ వర్మ వర్త్.. అనే డైలాగ్ మనం వినే ఉంటాం.అందులో పవర్ ఫుల్ విలన్ రోల్ చేసిన మళయాళీ నటుడు వినాయకన్ మరోసారి వివాదాల్లో నిలిచాడు. గతంలో మద్యం మత్తులో పోలీసులతో గొడవ పెట్టుకుని అరెస్టు అయిన ఆయన.. తాజాగా మరోసారి మద్యం ఫుల్లుగా సేవించి తన ఇంటి పక్కన ఉండే ఇరుగుపొరుగుతో గొడవ పెట్టుకున్నాడు.

లుంగీ జారిపోతున్నా చూసుకోకుండా కనీసం తన బాడీ మీద కంట్రోల్ లేకుండా అసభ్యకరంగా, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఇంటి బాల్కనీలోకి వచ్చి అతిగా ప్రవర్తించాడు. ఇదే విషయంపై వారు ప్రశ్నించగా వారిని బూతులు తిడుతూ నానా రభస చేశాడు. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ గొడవకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, జైలర్ మూవీ రిలీజ్‌కి ముందు వినాయకన్ పెద్దగా ఎవరికీ తెలీదు. జైలర్ సక్సెస్ తర్వాత ఆయన పేరు అంతటా మార్మోగింది. కాగా, వినాయకన్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుండం ఆయనకు మైనస్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version