సమంత సినిమా యశోద హిట్టా లేక పట్టా..?

-

సమంత కొత్త సినిమా యశోద ఫలితం పై అందరూ తలో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది సినిమా హిట్టయ్యింది అని  మరికొంత మంది ఎవరేజ్ అని అంటున్నారు. ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం.. నాన్ థియేట్రికల్ హక్కులకు  30 కోట్లకు పైన అమ్మారట.

ప్రస్తుతం ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రస్తుతం కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయట. ఇక వరల్డ్ వైడ్ గా 25 కోట్లు దాకా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 5 లక్షల డాలర్స్ మార్క్ ని చేరుకొని హాఫ్ మిలియన్ క్లబ్ లోఅడుగు పెట్టింది.ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ వర్గాలు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీనికి నిర్మాత, డైరెక్టర్స్ హాజరు అయ్యారు.

అయితే యశోద సినిమా కు సీక్వెల్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత నిజమేనని ధృవీకరించారు. ఈ సినిమా కు సీక్వెల్ చేసే  విషయంలో మా దగ్గర ఓ ఆలోచన ఉంది.  అంతే కాదు మూడవ భాగానికి ఓ లీడ్ ఉంది. సమంత  పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత ఆమెతో  చర్చిస్తాం. ఆమె ఒప్పుకుంటే  వెంటనే సీక్వెల్ పట్టాలెక్కిస్తాం అని వెల్లడించారు. కాని చాలా మంది ఇప్పడు తీసిన సినిమానే హిట్టో కాదో తెలియదు అంతలోనే రెండో భాగమా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version