తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. గ్రూప్ 2, గ్రూప్ 3 కి ఒకే నోటిఫికేషన్..!

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భ‌ర్తీకి స‌న్నాహాలు చేస్తుంది. ఇప్ప‌టికే రాష్ట్ర ఆర్థిక శాఖ దాదాపు 37 వేలకు పైగా ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తులు జారీ చేసింది. దీంతో ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తి వ‌చ్చిన శాఖల నుంచి ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధం అవుతుంది.

అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌డానికి ఒకే నోటిఫికేషన్ విడుద‌ల చేయాల‌నే ఉద్దేశంతో టీఎస్ పీఎస్సీ ఉన్న‌ట్టు తెలుస్తుంది. గ్రూప్ – 2 విభాగంలో 582, గ్రూప్ – 3 విభాగంలో 1,373 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు విభాగాల్లో 1,955 పోస్టులు ఉన్నాయి. వీటిని ఒకే నోటిఫికేషన్ జారీ చేసి.. భ‌ర్తీ చేయాల‌ని టీఎస్ పీఎస్సీ నిర్ణ‌యం తీసుకున్నట్టు స‌మ‌చారం.

అలాగే గ్రూప్ – 4 లో ఖాళీగా ఉన్న 9,168 ఉద్యోగాల‌ను కూడా టీఎస్ పీఎస్పీ భ‌ర్తీ చేయాలా.. లేదా నియామ‌క సంస్థ‌ల‌కు అప్ప‌గించాలా అని ప్ర‌భుత్వం ఆలోచిస్తుంది. దీని కోసం ఆయా శాఖ‌ల అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం కోర‌నుంది. దీని పై నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత‌.. నోటిఫికేషన్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version