బీ టౌన్ లవ్ బర్డ్స్ ఆలియా భట్- రణ్ బీర్ కపూర్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. గురువారం బాంద్రాలోని వాస్తులో ఘనంగా వీరి మ్యారేజ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకకు అతి తక్కువ మంది సెలబ్రిటీలు హాజరు కావడం గమనార్హం. బాలీవుడ్ సెలబ్రిటీలు అయాన్ ముఖర్జీ, కరీనా – సైఫ్ కపుల్, కరణ్ జోహార్ , ఆకాశ్ అంబానీ తో పాటు ఇంకొందరు మ్యారేజ్ కు హాజరయ్యారు.
ఇకపోతే మ్యారేజ్ అనంతరం రణ్ బీర్ కపూర్ దంపతులు ఇంటి నుంచి బయటకు వచ్చారు. మీడియాకు ఫొటోలు ఇచ్చేందుకు బయటకు వచ్చిన నవ దంపతులు అలా అందరినీ చూసి మురిసిపోయారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇంటిలోకి వెళ్లే క్రమంలో రణ్ బీర్ కపూర్ ఆలియా భట్ ను అమాంతంగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
ఎట్టకేలకు లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారని ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆలియా రణ్ బీర్ రియల్ లైఫ్ కపుల్ అయిన సందర్భంగా వారిరువురికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెప్తున్నారు. వీరు ఆన్ స్క్రీన్ కపుల్ గా ‘బ్రహ్మస్త్ర’ ఫిల్మ్ లో నటిస్తున్నారు. మొత్తంగా బీ టౌన్ లవ్ బర్డ్స్ ఇక అఫీషియల్ గా చెట్టా పట్టాలు వేసుకుని తిరగొచ్చు.