టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం..షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ క్రమంగా హీరోగా ఎదిగాడు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్…తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు.
ఇటీవల విడుదలైన ‘సెబాస్టియన్ పీసీ 524’ అంతగా ఆకట్టుకోలేదు. కాగా, తన నెక్స్ట్ ఫిల్మ్ ‘సమ్మతమే’ ..ఈ నెల 24న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ చిత్ర యూనిట్ కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మద్దతు తెలుపున్నారు. ఈ నెల 16న సాయంత్రం 04.05 గంటలకు ‘సమ్మతమే’ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సినిమా డెఫినెట్ గా ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Thank you sir @KTRTRS ❤️
Trailer tomorrow 4:05pm #SammathameFromJune24th pic.twitter.com/Q2R7EbkPkx
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 15, 2022