ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా : వైఎస్ షర్మిల

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. బాలరాజు కనుసన్నల్లో ఇసుక మాఫియా జరుగుతోందని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ కంటైనర్‌లో వస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ కి జగన్ తీరని ద్రోహం చేశారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని ఆమె ప్రశ్నించారు.

గత పది సంవత్సరాలలో పట్టుమని పది పరిశ్రమలన్న రాష్ట్రానికి వచ్చాయా అని నిలదీశారు. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా…? అని ఆమె ప్రశ్నించారు. ఏపీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సింగపూర్ చేస్తానన్నారని.. కానీ అమరావతి కాస్తా భ్రమరావతి అయిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ఒక రాజధాని సరిపోలేదని.. మూడు రాజధానులు కావాలన్నారని.. చివరకు ఏపీకి గుండు సున్నానే మిగిల్చారని షర్మిల మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version