పేకాట క్లబ్బులు కావాలా.. డీఎస్సీ కావాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం ఉంగుటూరులో వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పాఠశాల పుస్తకాలపై జగన్ ఫొటోలు పెట్టడమేంటని ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 3 లక్షల 80 వేల మంది విద్యార్థులు స్కూళ్లు మానేశారని తెలిపారు. రాష్ట్రంలో పేకాట, మద్యం, ఇసుక దోపిడీ బాగా పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.39 కేసులున్నాయని 5 సంవత్సరాలుగా జగన్ బెయిల్ పై ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని పవన్ జోస్యం చెప్పారు.యువత భవిష్యత్తు బాగుండాలంటే సీఎం సరైనోడా కాదా అనేది చూడాలన్నారు. దోపిడీ చేసే రాజకీయ నాయకులకు కాలేజీలు, స్కూళ్లలో ఏం పని అని ,క్రిమినల్స్ ను గెలిపిస్తే భవిష్యత్తు అంధకారం అని అన్నారు.ఉంగుటూరులో మంచినీటి సమస్య ఉందని, ఈ సమస్యలు పరిష్కరించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.