ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు రిప్రజెంట్ చేస్తున్నా ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం అటకెక్కింది. ఆస్పత్రి పరిసరాలు మురుగు కంపుతో దుర్వాసనను వెదజల్లుతున్నాయి.
మురుగు ఎక్కడికక్కడ పేరుకుపోయి, గదులన్నీ దుర్వాసనతో అధ్వానంగా మారాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేతనాలు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టు కార్మికులు నిరసన చేపట్టడంతో ఆసుపత్రిలో ఉండలేని దుస్థితి నెలకొందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఇక ఆస్పత్రికి రోగులు రావడం మానేస్తారని కొందరు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.