సత్యవతి రాథోడ్, వివేకానంద్‌కు కేసీఆర్‌ కీలక పదవులు !

-

మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కెపీ వివేకానంద గౌడ్ కు కీలక పదవులు ఇచ్చారు బీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌. శాసనమండలిలో బిఆర్ఎస్ పార్టీ విప్ గా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్..ను నియామకం చేశారు కేసీఆర్‌. శాసన సభలో పార్టీ విప్ గా కెపీ వివేకానంద గౌడ్ ను నిర్ణయించారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.

Satyavati Rathore, Vivekanand KCR key positions

ఇక అధినేత నిర్ణయాన్ని కేటిఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ కు తెలియ చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు. కాగా, పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్‌ షాక్‌ తగిలింది. పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రెటరీ నోటీసులు ఇచ్చారు. అయితే… ఈ నోటీసులు జారీ అయిన నేపథ్యంలోనే…పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. నోటీసులకు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని కోరారు పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news