రామలింగారెడ్డి చనిపోవడానికి కారణం కేసీఆరే.. ఇంట్లో వేసి తాళం వేశారు !

-

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంటలో ప్రచారం చేస్తున్న బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎంకి కలలో కూడా దుబ్బాకనే గుర్తుకు వస్తోందని ఆయన అన్నారు. నేను కేంద్ర నిధుల పై చేసిన సవాల్ కి కట్టుబడి ఉన్నానన్న దుబ్బాక చౌరస్తాలో సీఎంతో చర్చకు రెడీ అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తావా, దుబ్బాక చౌరస్తా కి వస్తావా ? సిగ్గు శరం లజ్జ ఉంటే రా అని సవాల్ చేశారు.

తెలంగాణ యువకుల నిన్ను తరిమి తరిమి కొడతారన్ని అన్నారు. రామలింగారెడ్డి చనిపోవడానికి కారణం సీఎం కేసీఆర్ అని పేర్కొన్న ఆయన అభ్యర్థి సుజాత అక్క కొడుకు ఎక్కడికి పోయాడు ? ఆయనని ఇంట్లో వేసి తాళం వేశారని అన్నారు. దుబ్బాక లో గెలవాలని కేసీఆర్ కి లేదన్న ఆయన కొడుక్కి అల్లుడి అడ్డంకి లేకుండా చూడాలని చూస్తున్నాడని అన్నారు. టీఆర్ఎస్ వాళ్ల దగ్గర 10వేలు తీసుకోండి బీజేపీ కి వోట్ వేయండని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version