విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం మెనూ ప్రకారం ప్రతిరోజు వడ్డించాలని ఝరాసంఘం తహసిల్దార్ సంజీవరావు చెప్పారు. సంజీవరావు బుధవారం మండల కేంద్రం లో కస్తూరిబా గాంధీ విద్యాలయానికి వెళ్లారు. ఆయన సిబ్బంది తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకి అందించాల్సిన భోజనంలో ఆకుకూర నెయ్యి పెట్టాలి.
కానీ ఈ రెండు పెట్టకుండా వంకాయ మాత్రమే విద్యార్థులకి పెట్టారు. దీంతో ఆయన పాఠశాల ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని ఆదేశించారు. అలానే భోజనం నాణ్యతని పరిశీలించి భోజనం చేసారు ఆయన భోజనం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసిల్దార్ ప్రిన్సిపాల్ ని పాఠశాలకు సంబంధించిన వివరాలు అడిగితే ఆ సమాధానాలు చెప్పకుండా దాటవేశారట.