రాక రాక టీంలోకి వచ్చిన టీం ఇండియా యువ ఆటగాడు సంజూ సామ్సన్ కి ఊహించని విధంగా షాక్ ఇచ్చిన సెలక్షన్ కమిటి. ఎప్పుడో 2015 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన టీం సంజూ, ఆ తర్వాత టీం అంతర్జాతీయంగా 73 మ్యాచులు ఆడిన తర్వాత సంజూ టీంలోకి వచ్చాడు. మూడో మ్యాచ్ లో అతనికి అవకాశం దక్కింది. రిషబ్ పంత్ ని పక్కన పెట్టి అతనికి అవకాశం ఇచ్చారు.
అయితే అనూహ్యంగా మళ్ళీ అతన్ని జట్టు నుంచి తప్పించారు. జనవరి నెలాఖరున న్యూజిలాండ్ జట్టుతో టీ-20 సిరీస్‌లో తలపడే భారత జట్టుని సోమవారం బోర్డ్ ప్రకటించింది. శ్రీలంకతో మ్యాచ్ లో వచ్చిన అవకాశాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ నేపధ్యంలో అతన్ని జాతీయ జట్టు నుంచి మరోసారి తప్పించారు. శ్రీలంక సిరీస్‌కి దూరమైన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి వచ్చారు.
దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక్క మ్యాచ్ తో అతని ప్రతిభను ఏ విధంగా గుర్తిస్తారని, రిషబ్ పంత్ కి ఎన్ని అవకాశాలు ఇచ్చారని, కనీసం బ్యాట్ పట్టుకోవడం రాని క్రునాల్ పాండ్యాని ఎందుకు జట్టులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రునాల్ పాండ్యా బ్యాక్ గ్రౌండ్ చూసి ఉంచారా అంటూ నిలదీస్తున్నారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను బోర్డ్ తొక్కేస్తుంది అంటూ ఆగ్రహ౦ వ్యక్తం చేస్తున్నారు.