బికీనీ వేసుకుని తమ్ముడితో.. హీరోయిన్‌పై విమర్శలు

-

బాలీవుడ్ రైజింగ్ స్టార్ సారా అలీ ఖాన్ చేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వివాదానికి దారి తీస్తున్నాయి. తమ్ముడు ఇబ్రహీమ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్బంగా ఆమె తన ప్రేమను చాటింది. అయితే అంతవరకు బాగానే ఉన్నా ఆమె షేర్ చేసిన ఫోటోలే అభ్యంతరం చెప్పేలా ఉన్నాయి. తమ్ముడితో ఉండేటప్పుడు కనీసం ఎలా ఉండాలో కూడా తెలీదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

‘నా సోదరుడికి హ్యాపియెస్ట్ బర్త్‌డే.. నీకు తెలిసిన దానికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. ఈ రోజు నీ పక్కన లేకపోయినందుకు చాలా బాధపడుతున్నా’.. అంటూ మాల్దీవుల్లో బికినీతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అందులో ఇబ్రహీమ్ సైతం ఒంటి మీద బట్టలు లేకుండానే ఉన్నాడు. మరో ఫోటోలో ఆ ఇద్దరు ఇచ్చిన పోజు కూడా అసభ్యకరంగా ఉంది.

సోదరుడితో ఇలాగేనా ఫోటో దిగేది? సోదరితో ఇలానేనా ఉండేది? బికినీలో ఉన్న అక్కా తమ్ముడు మీరే, మీకు సిగ్గు లేదా? అంటూ చెడామడా తిట్టిపారేస్తున్నారు. ఇకఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. సారా అలీ ఖాన్ తాజాాగా లవ్ ఆజ్ కల్ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news