ఆ సీన్ కి ‘ సరిలేరు’ థియేటర్ లలో ఒక్కరూ కూడా సీట్ లో కూర్చోరు !!

-

 

అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రోజుల తర్వాత మాస్ గెటప్ లో కనిపించనున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది మహేష్ సరసన రష్మిక మందన జంటగా నటించగా.. రాజేంద్రప్రసాద్, విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 

అయితే ముందు నుంచి ఈ సినిమాకి మాస్ అప్పీల్ తీసుకొని వచ్చిన దర్శకుడు అనిల్ స్పెషల్ గా రెండు చోట్ల ప్రేక్షకులను అసలు అదుపు చేయలేము అని చెబుతున్నాడు ఒకటి ఇంటర్వల్ బ్లాక్ గా చెప్పబడే కొండారెడ్డి బురుజు ఫైట్ సీన్ కాగా రెండవది దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన ‘మైండ్ బ్లాక్’ అనే ఐటెం సాంగ్

మహేష్ బాబుకి కొండారెడ్డి బురుజు తో ఉండే హిస్టరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కడు సినిమాలో అతను ప్రకాష్ రాజ్ ను కొట్టే సీన్ మహేష్ అభిమానులు జీవితాంతం మరిచిపోరు. ఇకపోతే బాబు ఒక మాస్ సాంగ్ లో చివరగా లుంగీ కట్టింది పోకిరి సినిమాలో. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను ఏవిధంగా తిరగరాసిందో తెలుగు సినీ ప్రేక్షకులు మర్చిపోరు.

ఇలా రెండు బలమైన సెంటిమెంట్లను తనకు తోడుగా వేసుకొని చాలా రోజుల తర్వాత మాస్ అవతార్ లో అభిమానుల కోసం షూటింగ్ లో మహేష్ సందడి చేయబోతున్నాడు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు అయితే థియేటర్ ఓనర్ లకు ఇన్సూరెన్స్ చేయించుకోమని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version