సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ అతి త్వరగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో కూడా దూసుకుపోతోంది.
ఇందులో భాగంగానే ఆదివారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తుండడంతో సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి కి రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయి. ఒకటి తనకు అబ్బాయి పుట్టడం కాగా మరోటి మెగాస్టార్ అతిథిగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రోజే అది జరగడం. అలాగే ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న దిల్ రాజు కు కూడా ఆ రోజే మనవరాలు పుట్టిందట.
కొత్త సంవత్సరం ప్రారంభంలో దర్శక నిర్మాతల ఇంట్లోకి కొత్త అతిథులు రావడంతో పాటు సినిమాకు వస్తున్న మంచి రెస్పాన్స్ అన్ని కలగలుపుకొని ఈచిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. విడుదలకు ముందు జరుగుతున్న శుభపరిణామాలే ఇందుకు సూచకం అని భావిస్తున్నారు. మరోవైపు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ట్రిండింగ్‌గా కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కావడం ఖాయం అని గట్టిగా నమ్ముతున్నారు చిత్ర యూనిట్. మరి వీరి ఆశలు, నమ్మకాలు ఎంత వరకు ఫలిస్తాయో తెలియాలంటే.. ఈ నెల జనవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే.