మద్యం సీసాలతో బతుకమ్మ ఆడిన స‌ర్పంచ్‌..

-

బతుకమ్మ పండుగ తెలంగాణా సాంస్కృతిక ప్రతీక‌గా జరుపుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండగ వస్తూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో బతుకమ్మను అవమానిస్తూ.. సాక్షాత్తు పంచాయితీ సర్పంచ్ ఇతర నేతలతో కలిసి కార్యాలయం ముందు మద్యం సీసాలతో బ‌తుకమ్మ ఆడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన బతుకమ్మ వేడుకల్లో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ రమేష్‌తో పాటు మరి కొందరు మద్యం బాటిళ్లు పెట్టి ‘సారా సారమ్మ’ అంటూ డీజే పెట్టి బాటిళ్ల చుట్టూ బతుకమ్మ ఆటలు ఆడార‌ని మహిళల నుంచి ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ సంప్రదాయాన్ని కించపరుస్తూ మద్యం బాటిళ్లతో డ్యాన్స్‌లు చేసిన సర్పంచ్‌, ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే అవి బతుకమ్మ సంబురాలు కావని, బర్త్‌డే వేడుకల్లో విందు చేసుకున్నామని సర్పంచ్ రమేష్‌ను వివరణ ఇచ్చారు. ఆ సమయంలో గిట్టని వారు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news