సిరిసిల్ల లో దారుణం… చిన్నారిపై సర్పంచ్ భర్త లైంగిక దాడి..!

-

సిరిసిల్ల జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని ఓ గ్రామంలో గిరిజన బాలికపై సర్పంచ్ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో సర్పంచ్ భర్త ను పోలీసులు అరెస్ట్ చేసి ఫాక్సో.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఇంట్లో కొద్ది రోజులుగా ఒక కుటుంబం అద్దెకు ఉంటోంది. అయితే ఈ నేపథ్యంలో తాను ఉద్యోగానికి వెళ్తూ మహిళ తన కూతుర్ని సర్పంచ్ ఇంట్లో వదిలి వెళ్ళింది.

rape

దాంతో ఎవరు లేని సమయంలో సర్పంచ్ భర్త చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో చిన్నారులపై దారుణాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో రాజు అనే యువకుడు చిన్నారిపై లైంగిక దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. కిరాతకున్ని పోలీసులు వెంటాడటం తో భయాందోళనకు గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మానవ మృగాలలో లో మార్పు వస్తుందని అంతా భావించారు. కానీ అలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version