రేపు సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామని… అక్టోబర్ మాసంకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేశామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సాంకేతిక పరిజ్ఞనాని వినియోగించామని… మొదటి సారి క్లౌడ్ మేనేజ్ మెంట్ ద్వారా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేశామని పేర్కొన్నారు..
శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూండడంతో….దర్శనానికి డిమాండ్ పెరిగిందని వెల్లడించారు. ఆగష్టు,సెప్టంబర్ మాసంకు సంభందించిన టిక్కెట్లు విడుదల సమయంలో సాంకేతికపరంగా సమస్యలు తల్లేత్తాయన్నారు… టీటీడీకి క్లౌడ్ మెనెజ్మెంట్ సేవలు ఉచితంగా అందించేందుకు జియో సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.
జియో,టిసియస్,టీటీడీ ఐటి ఉద్యోగులు నిరంతరం పని చేసి అక్టోబర్ మాసంకు సంభందించిన టిక్కెట్లు విడుదల ప్రోగ్రామింగ్ చేశారని.. సోషల్ మీడియాలో కొంత మంది టీటీడీ పై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.రేపటి రోజున టిక్కెట్లు విడుదల సమయంలో సమస్యలు తల్లేత్తకూండా వుండేందుకు జియో,టిసియస్ తో టీటీడీ ఐటి అధికారులు సమావేశం నిర్వహిస్తారని ధర్మారెడ్డి పేర్కొన్నారు.