కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ రాజస్థాన్ నుండి రాజ్యసభ కి పోటీ చేస్తున్నారు దీంతో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. సోనియా గాంధీ అలసిపోయారని సెటైర్లు వేశారు సోనియా గాంధీ జైపూర్ పర్యటన గురించి స్పందిస్తూ సోనియా తప్పనిసరిగా అలసిపోయి ఉంటారని చురకలని అంటించారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన విమర్శలపై స్పందిస్తూ రాహుల్ పై విరుచుకుపడ్డారు గిరిరాజ్ సింగ్.
మోడీ కనుక మళ్ళీ గెలిస్తే నియంతృత్వం రాజ్యమేలుతుందని గతంలో ఖర్గే కామెంట్లు చేశారు. ఖర్గే అలా అనుకోవచ్చు అని ప్రజల దృష్టిలో మోడీ అత్యంత ప్రశాధారణ పొందిన నాయకుడని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఖర్గే విసిగిపోయారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని లాంచ్ చేసేందుకు చాలా ప్రయత్నం చేశారని కానీ లాంచింగ్ ప్యాడ్ లో కొన్ని సమస్యలు తలెత్తాయి అందుకే లాంచ్ చేయలేకపోయారని అన్నారు.