ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ తన కలను సహకారం చేసుకుంది. 11 సంవత్సరాల తర్వాత మరోసారి తన పథకాన్ని ముద్దాడింది. 2011 తర్వాత మళ్లీ పథకాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం ఈ ఘనతను సాధించింది.
తమ పథకాన్ని వెండి లేదా బంగారంగా మార్చుకోవడానికి అవకాశం లభించినప్పటికీ, దాన్ని సద్వినియోగం చేసుకోవడం కాసింత నిరాశపరిచినప్పటికీ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
టోక్యోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్ లో వారు ఓడిపోయారు. మలేషియా కు చెందిన ఆరోన్ చియా-సోహ వుయ్ ఇక్ చేతిలో 22-20, 18-21, 16-21 తేడాతో పరాజయాన్ని చవి చూశారు. ఈ ఓటమి తో ఈ టోర్నమెంట్ పురుషుల డబుల్సు నుంచి వైదోలగాల్సి వచ్చింది. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.