టిడిపిలోకి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ?

-

టిడిపిలోకి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండూ,మూడు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో చేరే అవకాశం  కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు టిడిపి నేతలకు టచ్ లో ఆదిమూలం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపి ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న ఆదిమూలం.

మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర స్దాయిలో అవినీతి ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే  ఆదిమూలం.పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని…జిల్లా రెడ్లదే రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆదిమూలం మాటలకు కౌంటర్ ఇచ్చారు తిరుపతి ఎంపి గురుమూర్తి. ఎమ్మెల్యే నుండి ఎంపి సీటు ఇస్తే… ఆదిమూలం అవకాశవాద రాజకీయ చేస్తున్నారు అన్నారు. గౌరవం ఇచ్చిన వైసీపీ పై ఆదిమూలం అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గురుమూర్తి. ముందుగానే ఆదిమూలం టీడీపీ నేతలతో మాట్లాడుకునే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవ్వరూ పార్టీలోంచి వెళ్లిపోయినా.. అధికారంలోకి వచ్చేది మాత్రం వైసీపీనే అని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version