చీరలో అల్లు అర్జున్.. క్రీజీ ఫోటో లీక్..!

-

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. తాజాగా పుష్ప టు కి సంబంధించిన ఒక ఫోటో లీక్ అయింది పుష్ప టు సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప కి మించి పుష్ప టు ని సుకుమార్ తెర మీదకి తీసుకువస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన అదిరిపోయే క్లిప్ ఒకటి నెట్ వైరల్ అవుతోంది.

రామోజీ ఫిలిం సిటీలో పుష్ప టు సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ క్రమంలో బన్నీ చీర కట్టుకుని ఉన్న ఒక ఫోటో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ నీలం రంగు చీర కట్టుకుని కుర్చీలో కూర్చున్నారు. తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప టు సినిమాలో కొన్ని సీన్స్ ఉంటున్నాయి ఆ జాతరకు సంబంధించిన సీన్స్ ని కంప్లీట్ చేసేసారు ఇప్పుడు ఇంకొన్ని సీన్స్ ని యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కి చీర కట్టి అచ్చం అమ్మవారి లాగానే తయారు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version