ఇవాళ నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు అంటే కరువు గుర్తుకొస్తుంది. కరెంట్ కోతలు గుర్తుకొస్తారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు. మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి. బాబు పేరు చెబితే బషీర్ బాగ్ కాల్పులు గుర్తుకొస్తాయి.
2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. పేద, మధ్య తరగతి ప్రజల చిరునవ్వే నాకు అవార్డు.. రివార్డులు అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమమైనా గుర్తుకొస్తుందా..? అని ప్రశ్నించారు. నాడు నేడు పేరుతో పాటశాలల రూపురేఖలు మార్చాం. బాబు చరిత్ర చూస్తే.. ఏముంది గర్వకారణం..? మళ్లీ ముగ్గురు రంగురంగు మేనిపెస్టోతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారు. నారా వారి పాలనను మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారు. విశ్వసనీయతకు వంచెనకు మధ్య జరుగుతున్న యుద్ధంలో మీరంతా సిద్దమేనా..? అని అడిగారు.