స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు బంపరాఫర్ ఇచ్చింది. హోంలోన్లపై కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.ప్రతి ఒక్కరూ సొంత ఇళ్లు ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో దిగ్గజ స్టేట్ బ్యాంకింగ్ ఆఫ్ ఇండియా ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని హోం లోన్లపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ‘ఈ ఇండిపెండెన్స్ రోజున, హోం లోన్లపై జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి‘ అంటూ తాజాగా ట్వీట్ చేసింది. ఈ సమయంలో ఎస్బీఐ నుంచి
- ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు గృహ రుణాలు పొందొచ్చు.
- మహిళా ఖాతాదారులకు అదనంగా 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభించనుంది.
- ఎస్‌బీఐ యోనో వినియోగదారులకు కూడా యోనో ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి 5 బీపీఎస్ వడ్డీ రాయితీ అందుకోవచ్చు.
- కేవలం 6.70 శాతం వడ్డీ రేటుతోనే ఎస్‌బీఐ కస్టమర్లు హోం లోన్లు తీసుకోవచ్చు.
- గృహ రుణం పొందాలనుకునేవారు 7208 933140 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లోన్ పొందవచ్చు.
హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్..
హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది. హోమ్ లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికేట్ అంటారు. ఎస్బీఐ ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ క్విక్ ద్వారా హోమ్ లోన్ ఇంటరెస్ట్ కాపీని సులభంగా పొందవచ్చు. మీరు రుణాలు తీసుకున్న బ్యాంకు లేదా సంస్థ హోమ్ లోన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపులో మినహాయింపు కోసం హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అవసరం.